బోటు ప్రమాదం వెనుకున్న నిజాలు బయటపెట్టినందుకు హర్షకుమార్ ను కేసులతో వేధిస్తారా?: నారా లోకేశ్ మండిపాటు
- రాజకీయ రంగు పులుముకున్న బోటు మునక వ్యవహారం
- ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
- ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి బోటును వదిలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి వైఎస్ జగన్ మునిగిపోయిన బోటును బయటికి తీయలేడా అంటూ నిలదీశారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని మండిపడ్డారు.