వరుసగా ఆరో రోజూ పెరిగిన పెట్రోలు ధర!
- సౌదీపై దాడుల తరువాత పెరిగిన ధరలు
- ఆరు రోజుల్లో రూ. 1.59 పెరిగిన పెట్రోలు ధర
- రూ. 1.31 పెరిగిన లీటర్ డీజిల్ ధర
మొత్తం మీద ఈ ఆరు రోజుల వ్యవధిలో పెట్రోలు ధర రూ. 1.59, డీజిల్ ధర రూ. 1.31 పెరిగింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ తగ్గడం కూడా చమురు ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. సౌదీపై దాడుల తరువాత, ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో 5 శాతం మేరకు తగ్గినట్టుగా తెలుస్తోంది.