తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికే జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!
- సంగారెడ్డి జిల్లాలో రాంగ్ రూట్లో వెళ్లిన కారు
- ఈ నెల 3న ఫిర్యాదు చేసిన సామాన్యుడు
- నిబంధనల మేరకు రూ.1,135 జరిమానా విధింపు
ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానా విధించారు.