ల్యాబ్ లో పనిచేసుకునే వాడిని... బెల్లంకొండ సురేశ్ గుర్తిస్తే... రాజమౌళి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు: నాగినీడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ల్యాబ్ లో పనిచేసుకునే వాడిని... బెల్లంకొండ సురేశ్ గుర్తిస్తే... రాజమౌళి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు: నాగినీడు

  • టాలీవుడ్ లో క్యారెక్టర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగినీడు
  • కుమారుడి వైద్యం నిమిత్తం నంద్యాలకు
  • మహానందిలో మీడియాతో మాట్లాడిన నాగినీడు
'మర్యాద రామన్న' చిత్రం తనకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తీసుకురాగా, అంతకుముందే బెల్లంకొండ సురేశ్, తన ఫిజిక్ ను మెచ్చి 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చారని విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగినీడు తెలిపారు. మహా నందీశ్వరుడి దర్శనార్థం కర్నూలు జిల్లా మహానందికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను ప్రసాద్ ల్యాబ్స్ లో వర్కర్ పని చేస్తూ ఉండేవాడినని, తనను చూసిన బెల్లంకొండ సురేశ్, తొలి సినిమాలో అవకాశం ఇచ్చారని అన్నారు. తన జీవితంలో బెల్లంకొండ సురేశ్ తొలి అవకాశాన్ని ఇస్తే, రాజమౌళి, మరచిపోలేని బహుమతిని అందించారని, 'మర్యాద రామన్న' చిత్రం తరువాత వెనుదిరిగి చూసుకోలేదని అన్నారు. ఆ సినిమాతో తనకు ప్రత్యేక గుర్తింపు, స్థానం లభించాయని అన్నారు. ప్రస్తుతం వాల్మీకి, బందోబస్త్ చిత్రాల్లో నటిస్తున్నానని, అవి త్వరలోనే విడుదల కానున్నాయని చెప్పారు. తన కుమారుడి వైద్య సేవల నిమిత్తం నంద్యాలకు వచ్చానని అన్నారు.
Nagineedu

More Telugu News