ఇసుక కొరత సృష్టించి పేదల పొట్ట కొట్టారు: మంగళగిరి ధర్నాలో మాజీ మంత్రి లోకేశ్
- పాతబస్టాండ్ అన్నక్యాంటీన్ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన
- ఇసుక కొరతను నిరసిస్తూ ప్లకార్డుల ప్రదర్శన
- పేదల రాజ్యాన్ని పులివెందుల చేశారంటూ విమర్శలు
ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమేకాక, ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, ధర్నాలో పాల్గొన్న పలువురు నిర్మాణ రంగ కూలీలు ఇసుక కొరత వల్ల పనులు నిలిచిపోయి ఉపాధి లేక తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులుగా మార్చేశారని ధ్వజమెత్తారు.