జగన్ గారి ప్రభుత్వానికి ప్రజారోగ్యం చిత్తు కాగితంతో సమానం అనుకుంటా!: నారా లోకేశ్ ఆగ్రహం
- వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు
- గుంటూరు జిల్లాలో ఘటన
- ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ లోకేశ్
వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్య భద్రత చిత్తుకాగితంతో సమానంగా మారిందని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కాలం చెల్లిన నూనెప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ పాత సరుకుల కొనుగోలుకు జే-ట్యాక్స్(జగన్ ట్యాక్స్) ఎంత వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు.