పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలు.. కిరాతకంగా హత్యచేసి, పూడ్చేసి మొక్కను నాటిన ప్రియుడు!
Add ap7am to your home Screen

పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలు.. కిరాతకంగా హత్యచేసి, పూడ్చేసి మొక్కను నాటిన ప్రియుడు!

  • కేరళలోని తిరువనంతపురంలో ఘటన
  • సహజీవనం చేస్తున్న జంట.. యువకుడికి కుదిరిన పెళ్లి
  • విడిపోయేందుకు ఒప్పుకోని యువతి
పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు కోరడంతో ప్రియుడు ఉన్మాదిగా మారాడు. ఆమె గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఇంటి దగ్గరే పాతి పెట్టి వాసన రాకుండా ఉప్పు చల్లాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురంలో అఖిల్ నాయర్ అనే ఆర్మీ అధికారి ఉంటున్నాడు. అతను రేఖ అనే మోడల్ తో కలిసి కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవల అఖిల్ కు పెళ్లి కుదిరింది. దీంతో విడిపోదామని అఖిల్ ప్రతిపాదించాడు. దీనికి రేఖ ఒప్పుకోలేదు. తనను పెళ్లిచేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది.

దీంతో సహనం కోల్పోయిన అఖిల్ ఆమెను కారులో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లాడు. అనంతరం గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటి దగ్గరే గొయ్యి తవ్వి శవాన్ని పాతిపెట్టాడు. వాసన రాకుండా మృతదేహంపై ఉప్పు చల్లాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ మొక్కను కూడా నాటాడు. అయితే తమ కుమార్తె కనిపించడం లేదని రేఖ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రేఖను అఖిల్ చంపినట్లు నిర్ధారించారు. కాగా, అఖిల్ తో పాటు ఈ హత్యకు సహకరించిన మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Kerala
MARRIAGE
MURDER
Police
LOVE
LIVEIN RELATION SHIP

More Telugu News