హెచ్-1బీ వీసాల్లో భారీ మోసం.. అందుకే ఆ ఐటీ కంపెనీలపై వేటు: జేడీ వాన్స్ ఫైర్
- హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం చేస్తున్నారంటూ వాన్స్ తీవ్ర ఆరోపణలు
- ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా ఆరు కంపెనీలపై నిషేధం విధించిన ట్రంప్ సర్కార్
- విదేశీ వర్కర్లకు తక్కువ జీతాలిచ్చి మోసం చేస్తున్నారని వాన్స్ విమర్శ
- అమెరికన్లతో పోలిస్తే 48,000 డాలర్ల వరకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆరోపణ
- వీసా ప్రోగ్రామ్‌ను సంస్కరించాలని కాంగ్రెస్‌కు వాన్స్ పిలుపు
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ పలు ఐటీ కంపెనీలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్ కార్పొరేషన్లు, విదేశీ ఔట్‌సోర్సింగ్ సంస్థలు కలిసి విదేశీ ఉద్యోగులను దోపిడీ చేస్తున్నాయని, వారి ద్వారా అమెరికన్ల జీతాలను దెబ్బతీస్తూ, వారి ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది విస్తృత స్థాయిలో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ మోసమని ఆయన అభివర్ణించారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిబంధనలను కఠినతరం చేసి, అమెరికన్ వర్క్‌ఫోర్స్‌లో అందుబాటులో లేని అసాధారణ నైపుణ్యాలు ఉన్నవారినే విదేశాల నుంచి నియమించుకునేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, వాన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్‌తో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ వంటి ఆరు ప్రధాన ఔట్‌సోర్సింగ్ కంపెనీలను పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీల నుంచి కొత్తగా వచ్చే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను స్వీకరించడం, పెండింగ్‌లో ఉన్నవాటిని ప్రాసెస్ చేయడం నిలిపివేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్‌లింగ్ తెలిపారు.
విదేశీ ఉద్యోగులు బానిసలుగా మారుతున్నారు
జేడీ వాన్స్ మాట్లాడుతూ, "అత్యంత ప్రతిభావంతులను, అమెరికాలో భర్తీ చేయలేని ఉద్యోగాల కోసం విదేశీయులను తీసుకురావడానికి హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను ఉద్దేశించారు. కానీ దురదృష్టవశాత్తు, కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమం మోసపూరితంగా మారింది" అని ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ సంస్థలు, అమెరికన్ కంపెనీలు కలిసి అమెరికన్ల కంటే తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వాన్స్ విమర్శించారు.
"ఈ వీసా మోసంలో అమెరికన్ కార్పొరేషన్ల కన్నా ఈ విదేశీ సంస్థలదే ఎక్కువ బాధ్యత. హెచ్-1బీ వీసాపై వచ్చిన ఉద్యోగులు, అదే స్థాయి అమెరికన్ ఉద్యోగుల కన్నా ఏటా సుమారు 20,000 డాలర్లు తక్కువ సంపాదిస్తున్నారు. అదే విదేశీ ఔట్‌సోర్సింగ్ సంస్థల ద్వారా వస్తే, ఆ వ్యత్యాసం 48,000 డాలర్లకు చేరుకుంటోంది" అని ఆయన వివరించారు.
యజమానులు విదేశీ ఉద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారని వాన్స్ అన్నారు. ఉద్యోగం కోల్పోతే అమెరికాలో ఉండే అవకాశం ప్రమాదంలో పడుతుందనే భయంతో ఉద్యోగులు యజమానుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని, వారిని "విదేశీ బానిసలు"గా వాడుకుంటూ లేబర్ ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించి, అదే సమయంలో 6,300 హెచ్-1బీ వీసాలు, దాదాపు 3,000 గ్రీన్ కార్డుల ద్వారా లబ్ధి పొందిందని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
వీసా దరఖాస్తుల్లో కంపెనీలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయని, సాధారణ ఉద్యోగాలకు కూడా అత్యంత ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని చూపిస్తున్నాయని, ఇదే అసలైన మోసమని వాన్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్-1బీ దరఖాస్తుల ఫీజులను పెంచడాన్ని ఆయన సమర్థించారు. నిజంగా ప్రతిభావంతులు కావాలనుకునే కంపెనీలు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎలాన్ మస్క్, ఏఎండీ సీఈవో లిసా సూ వంటి ప్రతిభావంతులను అమెరికా స్వాగతిస్తుందని, కానీ అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీసే వారిని కాదని తెలిపారు. ప్రస్తుత అధికారాలతోనే మోసాలను అరికడతామని, అదే సమయంలో హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో సంస్కరణలు తీసుకురావాలని కాంగ్రెస్‌ను కోరారు.