'సాహో'తో పోటీకి సిద్ధమైన 'కాప్పన్'
- సూర్య కథానాయకుడిగా 'కాప్పన్'
- కీలకమైన పాత్రలో మోహన్ లాల్
- తమిళంతో పాటు తెలుగు,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల
కానీ అదే రోజున 'సాహో' సినిమా విడుదల వుండటంతో,'కాప్పన్'ను అదే నెల 30వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే అనుకోకుండా 'సాహో' కూడా 30వ తేదీకి వెళ్లింది. దాంతో 'కాప్పన్' విడుదల వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సారి ఇక వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ వుంది. మలయాళంలో మోహన్ లాల్ కి విపరీతమైన క్రేజ్ ఉండటం వలన ఇక వెనక్కి తగ్గకూడదనే నిర్ణయానికి వచ్చేశారట.