'రణరంగం' నుంచి కాజల్ ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రణరంగం' నుంచి కాజల్ ఫస్టులుక్

  • తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి క్రేజ్
  •  సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రణరంగం'
  • సెట్స్ పై తమిళ .. హిందీ చిత్రాలు 
తెలుగు .. తమిళ భాషల్లో సుదీర్ఘ కాలంగా కాజల్ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ఇటీవలే తెలుగు ప్రేక్షకులను 'సీత' సినిమాతో పలకరించిన ఆమె, తదుపరి చిత్రంగా 'రణరంగం' చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, శర్వానంద్ జోడీగా ఆమె కనిపించనుంది.

ఈ రోజున కాజల్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను దర్శకుడు సుధీర్ వర్మ రిలీజ్ చేశాడు. సంతోషంతో బీచ్ లో ఆడిపాడుతున్నట్టుగా ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. కాజల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు ఆమె చేయాలనే ఆకాంక్షను సుధీర్ వర్మ వ్యక్తం చేశాడు. ఇక మరో వైపున తమిళ .. హిందీ భాషల్లోను కాజల్ చేస్తోన్న సినిమాలు సెట్స్ పై వున్నాయి.
sharwanand
kajal

More Telugu News