విలన్ ను కావాలనే గట్టి పట్టుదలతో వచ్చాను: కమెడియన్ ప్రియదర్శి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విలన్ ను కావాలనే గట్టి పట్టుదలతో వచ్చాను: కమెడియన్ ప్రియదర్శి

  • విలన్ పాత్రలంటే ఆసక్తి ఎక్కువ 
  • తొలి రెండు సినిమాల్లో విలన్నే
  • 'పెళ్లి చూపులు' కమెడియన్ ను చేసింది 
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో ప్రియదర్శి ఒకరు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆయన, వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "నాకు విలనిజం అంటే ఇష్టం .. అందువలన విలన్ పాత్రల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఒక కోట శ్రీనివాసరావు .. ఒక ప్రకాశ్ రాజ్ స్థాయికి వెళ్లాలని అనుకునేవాడిని.

ఈ కారణంగానే 'టెర్రర్' .. 'బొమ్మల రామారం' సినిమాల్లో విలన్ గా నటించాను. ఆ సినిమాలు అంతగా గుర్తింపు తీసుకురాలేదు .. ఆ తరువాత అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా 'పెళ్లి చూపులు' సినిమాలో అవకాశం వచ్చింది. ఏదో ఒకటిలే .. ముందు ఫుడ్డు దొరుకుతుందని చేశాను. ఆ పాత్రే నా కెరియర్ ను మలుపు తిప్పింది. నన్ను కమెడియన్ ను చేసి ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది" అని చెప్పుకొచ్చాడు. 
priyadarshi

More Telugu News