హీరో శర్వానంద్ కు తీవ్ర గాయాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో శర్వానంద్ కు తీవ్ర గాయాలు!

  • బ్యాంకాక్ లో '96' షూటింగ్
  • స్కై డైవింగ్ చేస్తుండగా ప్రమాదం
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స
టాలీవుడ్ హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ షూటింగ్ చేస్తూ గాయపడగా, తాజాగా హీరో శర్వానంద్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం '96' సినిమా షూటింగ్ లో భాగంగా బ్యాంకాక్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్న శర్వానంద్, ఓ రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. సినిమాలో స్కై డైవింగ్ షాట్ ఉండగా, దాన్ని చేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శర్వానంద్ భుజానికి, కాలికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Sharwanand
Accident
Bangkok
96

More Telugu News