విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్.. ముఖ్య నేతలతో వ్యూహాత్మక భేటీ!
Add ap7am to your home Screen

విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్.. ముఖ్య నేతలతో వ్యూహాత్మక భేటీ!

  • రేపు ఎన్నికల ఫలితాల ప్రకటన
  • జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న నేత
  • ఇప్పటికే అమరావతికి చేరుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విజయవాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా సమావేశం కానున్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో పవన్ చర్చించనున్నారు.

కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు రెచ్చగొట్టినా జనసేన ఏజెంట్లు ప్రశాంతంగా ఉండాలని సూచించనున్నారు. అలాగే ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై జనసేనాని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పవన్ విజయవాడలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 
Andhra Pradesh
Pawan Kalyan
Vijayawada
meeting
Jana Sena

More Telugu News