అయ్యో ‘తండ్రీ’...అందరూ ఉన్నా అనాథలా!
- పదవీ విరమణ చేసిన ఓ జూనియర్ ఇంజనీర్ దీనగాథ
- మూడు వారాలుగా నీరు తాగి ప్రాణాలు నిబెట్టుకున్న వైనం
- ఇద్దరు కొడుకులు...అయినా ఆదుకునే వారు లేరు
అయితే, అందరూ ఉన్నా ఆయన జీవితానికే ఓ ‘ఆసరా’ లభించ లేదు. భార్య చనిపోవడంతో చార్‌బౌలిలో ఒంటరిగా ఉంటున్నారు. తన పనులు తాను చేసుకుంటూ జీవిస్తుండేవారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో కదలలేని స్థితి ఏర్పడడంతో మూడు వారాలుగా ఇంటికే పరిమితమయ్యారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఇంటికి వచ్చి చూడగా వెంకటరామనర్సయ్య అపస్మారక స్థితిలో పడివున్నారు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్నాక వివరాలు రాబట్టారు. శరీరం సహకరించక పోవడంతో ఇంటికే పరిమితమయ్యానని, ఆహారం లేకపోవడంతో మంచినీరు తాగుతూ జీవించానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. పోలీసులు వెంటనే హైదరాబాద్‌లో ఉన్న కొడుకుకి పరిస్థితి వివరించి వరంగల్ రప్పించారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఆయనను బాగా చూసుకోవాలని చెప్పి అప్పగించారు.