ప్రభాస్ కారణంగానే ఆ టైటిల్ ను ఖరారు చేయలేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కారణంగానే ఆ టైటిల్ ను ఖరారు చేయలేదట!

  • తమిళంలో ప్రశంసలు అందుకున్న '96'
  • సెట్స్ పైకి వచ్చేసిన తెలుగు రీమేక్ 
  • టైటిల్ పై జరుగుతోన్న కసరత్తు  
శర్వానంద్ .. సమంత జంటగా దిల్ రాజు నిర్మాణంలో ఒక వైవిధ్యభరిత చిత్రానికి రంగం సిద్ధమైంది. క్రితం ఏడాది చివర్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న '96' మూవీకి ఇది రీమేక్. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. దాంతో శర్వానంద్ .. సమంత జంటగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగారు.

'ఉగాది' పండుగ సందర్భంగా నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో నాయిక పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ. కథలో నాయిక పాత్ర పేరు 'జానకి' కావడం వలన, 'జాను' అనే టైటిల్ ను ఖరారు చేయాలనుకున్నారు. అయితే 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. 'జాన్' అనే టైటిల్ కి 'జాను' అనే టైటిల్ దగ్గరగా ఉండటం వలన, దిల్ రాజు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. ఈ సినిమాకి మరో టైటిల్ ను ఖరారు చేసి .. త్వరలోనే ప్రకటిస్తారట.
sharwanand
samanta

More Telugu News