ఏపీ బీజేపీకి మరో షాక్.. పోటీ నుంచి తప్పుకుని కనిపించకుండా పోయిన బీజేపీ అభ్యర్థి
- రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా మహేశ్వరరెడ్డి
- గురువారం నామినేషన్ ఉపసంహరణ
- ఆ తర్వాత అదృశ్యం.. ఫోన్ స్విచ్ఛాఫ్
అయితే, కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి విషయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన గురువారం ఒక్కసారిగా పార్టీకి షాకిచ్చారు. గురువారం మధ్యాహ్నం తన నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఏం జరిగిందో తెలియక బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.