ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో మంచి అనుబంధం వుంది: సీనియర్ నటుడు అశోక్ కుమార్
- నా మొదటి సినిమా 'పున్నమి చంద్రుడు'
- 'తెనాలి రామకృష్ణుడు'మంచి పేరు తెచ్చింది
- వాళ్లలో కలిసి నటించడం అదృష్టం
"నేను బాగా నటిస్తాననీ .. నాకు నటనపట్ల ఆసక్తి ఉందని తెలిసి, మాగంటి రవీంద్రనాథ్ చౌదరిగారు నన్ను వెంటబెట్టుకు తీసుకెళ్లి దర్శకుడు విజయ బాపినీడుకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పున్నమి చంద్రుడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాను. ఆ తరువాత చేసిన 'తెనాలి రామకృష్ణ' ధారావాహిక నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ .. అక్కినేని నాగేశ్వరరావు వంటి హేమా హేమీలతో కలిసి నటించే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం. ఆ ఇద్దరితో నాకు గల సాన్నిహిత్యాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.