విజయవాడ ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఏటీఎం యంత్రాలు!
- నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఘటన
- అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగానే దగ్ధం
- షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న పోలీసులు
కానీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేటప్పటికే ఏటీఎం కేంద్రంలోని యంత్రాలు దగ్ధం అయ్యాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బ్యాంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.