డేటా చోరీ కేసును వీలైనంత త్వరగా విచారిస్తాం: సిట్ ఇన్ ఛార్జి స్టీఫెన్ రవీంద్ర
- ఈ వివాదంపై విచారణకు ప్రత్యేక నిపుణులు అవసరం
- ప్రతి అంశాన్ని కూలంకషంగా దర్యాప్తు చేస్తాం
- ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సహా మరేమైనా సంస్థలున్నాయేమో పరిశీలిస్తాం
డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సహా మరేమైనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయా? అన్న విషయమై పరిశీలిస్తామని చెప్పారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, సిట్ లోని 9 మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని అన్నారు. డేటా చోరీ కేసు దర్యాప్తుపై మీడియా సంయమనం పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.
‘సేవా మిత్ర’ యాప్ లో ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని, వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థకు ఎలా వచ్చిందన్న విషయమై దర్యాప్తు సాగుతుందని, ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని తెలిపారు. ఈ కేసు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వ్యవహారం కనుక కొంత సమయం పడుతుందని, ఏదేమైనా, వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పిస్తామని స్టీఫెస్ రవీంద్ర అన్నారు.