ఆత్మకూరు, కావలి, వెంకటగిరిలో పోటీ చేసేది వీరే.. ప్రకటించిన చంద్రబాబు!
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్య
- వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణకు మరో ఛాన్స్
- కావలి సీటును బీద మస్తాన్ రావుకు ఓకే చేసిన చంద్రబాబు
అలాగే కావలి నియోజకవర్గం నుంచి బీద మస్తాన్ రావు, వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల రామకృష్ణకు టికెట్ ఖరారు చేసినట్లు ఏపీ సీఎం వెల్లడించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి పోతుల రామారావు పేరును సీఎం ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు ఈరోజు తిరుపతి, సత్యవేడు, సూళ్లూరు పేట, గూడూరు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేయనున్నారు.