వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఫస్ట్ సింగిల్.. డేట్ ఫిక్స్!
- విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
- సినిమాలోని తొలి పాట ‘నారాయణమ్మ’ విడుదలకు సిద్ధం
- రేపు పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటన
- ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్
- ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్
విక్టరీ వెంకటేశ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని మొదటి పాట ‘నారాయణమ్మ’ను రేపు(సెప్టెంబర్ 22న) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ‘నారాయణమ్మ’ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇది ఒక మాస్ అండ్ ఎంటర్‌టైనింగ్ సాంగ్‌గా ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై వెంకటేశ్ అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో భారీ ఆశలు నెలకొని ఉన్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో ఇద్దరు భామలు నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి ప్రత్యేక పాత్రల్లో అలరించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.