పవన్ కల్యాణ్ టీడీపీతో కలిశారంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన జనసేన అధినేత!
- జనసేనకు 25 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు ఆఫర్
- టీడీపీ ఇచ్చిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు
- టీడీపీ, వైసీపీపై తీవ్రంగా మండిపడ్డ జనసేనాని
ఈరోజు ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ స్పందిస్తూ..‘జనసేన వైసీపీ-బీజేపీలకు భాగస్వామిగా ఉందని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు టీడీపీతో మేం కలిసిపోయామని వైసీపీ చెబుతోంది. నేను రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కాగానే, నేను టీఆర్ఎస్-వైసీపీ మనిషినని టీడీపీ ఆరోపిస్తుంది. మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అన్ని పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ట్వీట్ చేశారు. దీనికి స్మైలీ ఎమోజీని పవన్ కల్యాణ్ జత చేశారు.