జోరు పెంచిన పవన్ కల్యాణ్.. ఈ నెల 21 నుంచి రాయలసీమ టూర్!
- తొలుత కర్నూలులో మూడ్రోజులు భేటీ
- అనంతరం కడప, చిత్తూరులో సమావేశాలు
- రైతులు, కార్మికులతో జనసేనాని ముఖాముఖి
అనంతరం ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో కడప జిల్లాలో పవన్ జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నెల 28, వచ్చే నెల 1, 2 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటించనున్నారు. రాయలసీమలో యురేనియం, ఉక్కు పరిశ్రమలను పరిశీలించడంతో పాటు కేసీ కాలువ ఆయకట్టు రైతులతో ఈ సందర్భంగా పవన్ ముఖాముఖి సమావేశమవుతారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను జనసేన పార్టీ త్వరలోనే విడుదల చేయనుంది.