నా పదిహేనేళ్ల కెరియర్లో ఇదే ఫస్టు రీమేక్: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పదిహేనేళ్ల కెరియర్లో ఇదే ఫస్టు రీమేక్: దిల్ రాజు

  • '96' మూవీ నా మనసును కదిలించింది
  • సమంత .. శర్వానంద్ కరెక్ట్ అనుకున్నాను
  •  తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుంది  
ఈ ఏడాది ఆరంభంలోనే దిల్ రాజు 'ఎఫ్ 2'తో టాలీవుడ్ కి భారీ విజయాన్ని అందించారు. ప్రస్తుతం ఆయన 5 ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ..  'వీలైతే 6వ ప్రాజెక్టును సెట్ చేసే ఆలోచన కూడా వుంది' అని చెప్పారు. తమిళంలో వచ్చిన '96' మూవీ నా మనసును కదిలించింది. అందుకే తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను .. పదిహేను సంవత్సరాల నా కెరియర్లో ఇదే ఫస్టు రీమేక్ అవుతుంది.

ఈ సినిమాకి సమంత .. శర్వానంద్ కరెక్ట్ అనుకుని వాళ్లను ఎంపిక చేసుకున్నాను. తెలుగులో ఈ ప్రాజెక్టు పట్ల సమంత మొదట్లో ఆసక్తి చూపలేదంటూ వార్తలు వచ్చిన మాట నిజం. నిర్మాతగా నేను రంగంలోకి దిగాక .. ఒరిజినల్ మూవీ దర్శకుడికే రీమేక్ బాధ్యతను అప్పగించాక ఆమె ఒప్పుకుంది. ఈ సినిమా తెలుగులోను సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు వుంది" అని ఆయన చెప్పుకొచ్చారు. 
sharwanand
samanta

More Telugu News