మళ్లీ రంగంలోకి దిగుతోన్న నారా రోహిత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ రంగంలోకి దిగుతోన్న నారా రోహిత్

  • హిట్స్ కి దూరమైన నారా రోహిత్
  • తదుపరి సినిమా చైతన్య దంతులూరితో
  • వచ్చేనెల చివర్లో సెట్స్ పైకి    
కెరియర్ ఆరంభంలోనే నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. కొన్ని సినిమాలు ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, దర్శకుడు చైతన్య దంతులూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తొలి చిత్రమైన 'బాణం'తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన, తాజాగా నారా రోహిత్ కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడు. ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో, నారా రోహిత్ ఈ సినిమాను చేయడానికి ఉత్సాహాన్ని చూపించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసేశారు .. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావొచ్చాయి. వచ్చేనెల చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. మరోసారి ఈ ఇద్దరూ కలిసి హిట్ కొడతారేమో చూడాలి. 
nara rohith

More Telugu News