గోపీచంద్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన భామలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన భామలు

  • దర్శకుడు 'తిరు'తో గోపీచంద్
  • ఆల్రెడీ మొదలైపోయిన షూటింగ్
  •  సెకండ్ హీరోయిన్ గా జరీన్ ఖాన్    
గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు 'తిరు' ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇండో- పాక్ సరిహద్దుల్లో చిత్రీకరించారు.ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా మంచి క్రేజ్ వున్న హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రెండవ కథానాయికగా రాయ్ లక్ష్మిని గానీ .. హంసా నందినిని గాని తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరిపారట. ఇద్దరూ కూడా భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో, బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరికన్నా తక్కువ పారితోషికమే ఆమె తీసుకుంటోంది. అందువలన ఆమె ఎంపిక ఖరారు కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మొదటి కథానాయికాగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. 
gopichand

More Telugu News