'అసురన్'లో కీలక పాత్రలో మంజు వారియర్
- ధనుశ్ తదుపరి చిత్రంగా 'అసురన్'
- నిర్మాతగా కలై పులి థాను
- దర్శకుడిగా వెట్రి మారన్
గతంలో వెట్రిమారన్ .. ధనుశ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అందువలన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మంజు వారియర్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. మలయాళంలో మంజు వారియర్ కి మంచి క్రేజ్ వుంది. అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో మెప్పించింది. ఈ సినిమాలోనూ ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారట. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.