భావోద్వేగభరితంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ !
- సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ విడుదల
- ట్రైలర్‌లో ఆకట్టుకునే భావోద్వేగాలు
- ఆలోచింపజేసే సంభాషణలు
- ఆగస్టు 14న చిత్రం విడుదల
తమిళ కథానాయకుడు సూర్య నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం (నేడు) విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్‌ను గమనిస్తే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతోన్న కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్' ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. 'నా బాబు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలి' అంటూ రాధికా శరత్ కుమార్ డైలాగ్ నుంచి, గెలిచే వరకు ఆగకూడదు.. గెలిచిన తరువాత ఆ గెలుపు గురించి ఎక్కువ మాట్లాడకూడదు అంటూ సూర్య చెప్పే డైలాగ్ వరకు ట్రైలర్ ఆద్యంతం ఎంతో భావోద్వేగభరితంగా అనిపిస్తుంది. 'నీ సీటు చాలా స్ట్రాంగ్', 'ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావు' అంటూ కథనాయిక మమితా బైజు సూర్యను టీజ్ చేస్తూ చెప్పే సంభాషణలు ఫన్నీగా అనిపించాయి.
ట్రైలర్‌లో ఎమోషన్స్, సెన్సిటివ్ ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ ఇలా అన్నీ మిక్స్ చేసి దర్శకుడు సినిమా కథాంశాన్ని ఆడియన్స్‌కు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నలభై ఏళ్ల వయసులో అంతర్జాతీయ పిస్టల్ షూటర్‌గా సూర్య ఎలా ఎదిగాడు? అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ట్రైలర్‌తో ఆసక్తి కలిగించి సినిమా గురించి వెయిట్ చేసే విధంగా దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన ట్రైలర్ కట్ బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ఆహ్లాదంగా అనిపించింది.