తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడిన కారు, ఒకరి మృతి
- ప్రమాదంలో బెంగళూరుకు చెందిన సతీశ్ కుమార్ మృతి
- శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా ఘటన
- మరో నలుగురు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలు
తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న భక్తుల కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది.
బెంగళూరులోని గొట్టిగెరెకు చెందిన సతీష్ కుమార్ (72) తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. స్వామివారి దర్శనం ముగించుకుని కారులో తిరుగు ప్రయాణమైన క్రమంలో, 22వ హెయిర్‌పిన్ బెండ్ వద్ద వాహనం అదుపుతప్పింది. వేగంగా వెళుతూ రక్షణ గోడను ఢీకొట్టిన కారు, సుమారు 15 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో సతీష్ కుమార్ కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు ఉడత్, మనవరాళ్లు తియా, నైరాలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సతీశ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.