‘మేడా’ వ్యవహారంపై చంద్రబాబుతో చర్చిస్తాం.. ఈరోజు అమరావతికి రావాలని చెప్పాం!: మంత్రి సోమిరెడ్డి
- ఒకేసారి రెండు విడతల రుణమాఫి
- రైతులకు రూ.2 వేల కోట్ల సాయం
- అమరావతిలో మీడియాతో మంత్రి
రాజంపేటలో టీడీపీ నేతలు వర్సెస్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ కావడానికి రావాల్సిందిగా మేడాకు సమాచారం అందించామని అన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు పాటిస్తారని స్పష్టం చేశారు.