నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ ద్వంద్వార్థ వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
- కావేరి నిరసనలో సీఎం విజయ్‌ను విమర్శిస్తున్న సమయంలో ఘటన
- డీఎంకే నేత వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర ఆగ్రహం
- ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంజావూరులో కావేరి జలాల కోసం నిర్వహించిన నిరసనలో, నటి త్రిషను ఉద్దేశించి ఆయన ద్వంద్వార్థంతో మాట్లాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార టీవీకే, ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
కావేరి జలాల విషయంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై ఉదయనిధి విమర్శలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ సభలో కొందరు 'త్రిష.. త్రిష' అని నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం ఆపి నవ్విన ఉదయనిధి, "నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా, అక్కడికి చేరాలి" అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను కావేరి జలాల గురించే మాట్లాడుతున్నానని చెప్పినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనని విమర్శలు వస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి వ్యాఖ్యలు "అసహ్యకరమైనవి" అని, డీఎంకే రాజకీయ సంస్కృతి దిగజారిపోయిందని విమర్శించారు. చౌకబారు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఉదయనిధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
ఈ వివాదాన్ని అధికార టీవీకే మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాసింది. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరింది.