తమిళనాడు సీఎం కుర్చీ కోసం పన్నీర్ సెల్వం రహస్య పూజలు.. డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపణలు!
- సీఎం పళనిస్వామి జైలుకు వెళ్లాలని పూజలు
- ఉదయం 3.30 గంటలకు జరిగిందన్న డీఎంకే చీఫ్
- స్టాలిన్ విమర్శలను ఖండించిన మంత్రి జయకుమార్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరహాలో కొడనాడు ఎస్టేట్ కేసులో పళనిస్వామి జైలు పాలవ్వాలని ఈ పూజలు జరిగాయని స్టాలిన్ తెలిపారు. పళనిస్వామి జైలుకు వెళ్లగానే తాను సీఎం కావాలని పన్నీర్ సెల్వం కలలు కంటున్నారని విమర్శించారు. అన్ని మతాలకు సమానమైన సచివాలయంలో పూజలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.
ఈ ఆరోపణలు చేసినందుకు తనపై కేసు పెట్టే అవకాశముందనీ, దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ విసిరారు. మరోవైపు స్టాలిన్ విమర్శలను మంత్రి జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకేలో చీలికలు తీసుకొచ్చేందుకు దినకరణ్, స్టాలిన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.