రాజస్థాన్ కి బయలుదేరుతోన్న యాక్షన్ హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజస్థాన్ కి బయలుదేరుతోన్న యాక్షన్ హీరో

  • తిరు దర్శకత్వంలో గోపీచంద్
  • ఈ నెల 21నుంచి ఫస్టు షెడ్యూల్ 
  • 45 రోజుల పాటు అక్కడే షూటింగ్
ఆరంభంలో యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసిన గోపీచంద్, ఆ తరువాత యాక్షన్ కి ఎమోషన్ ను జోడించి ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరైపోయాడు. తన సినిమాలకి సంబంధించిన కథల్లో మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఆయనను సక్సెస్ అనేది పలకరించలేదు.

దాంతో గోపీచంద్ తన తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథలోనూ .. పాత్రలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన దర్శకుడు 'తిరు'తో కలిసి ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరగనుంది. కొన్ని యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తారట. ఈ సినిమా కోసం త్వరలోనే ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయనున్నారు. 
gopichand

More Telugu News