ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్?
- సూర్య హీరోగా రూపొందుతోన్న 'కప్పాన్'
- కథానాయికగా సాయేషా సైగల్
- కీలమైన పాత్రలో బొమన్ ఇరాని
ఈ సినిమాలో ప్రధానమంత్రి పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నట్టుగా సమాచారం. ఆయన సెక్యూరిటీ కమాండర్ గా సూర్య కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, మూడవ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆర్య .. బొమన్ ఇరాని కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'ఎన్జీకే' తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.