పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం చంద్రబాబు మళ్లీ కాళ్ల బేరానికి వస్తున్నారు!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- పార్లమెంటు ప్రాంగణంలో వైసీపీ నేత ఆందోళన
- రూ.4.5 లక్షల కోట్లను దోచేశారు
- సొంత ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చెలా పెడతారు?
ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల విషయంలో కేంద్రం మోసం చేసిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. గత నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.4.50 లక్షల కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ దోపిడీ చేసిందని విమర్శించారు. మీడియా సంస్థలకు సైతం చంద్రబాబు ప్రభుత్వం రూ.2,000 కోట్లు బకాయి పడిందని వ్యాఖ్యానించారు. అసలు సొంత ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎలాంటి వేషాలు వేసినా ఆర్థికశాఖ కార్యదర్శి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.