న్యూ ఇయర్ గిఫ్ట్ గా 'కల్కి' నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూ ఇయర్ గిఫ్ట్ గా 'కల్కి' నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది

  • 'గరుడ వేగ' ఘన విజయం 
  • తదుపరి సినిమా ప్రశాంత్ వర్మతో
  • పవర్ఫుల్ పాత్రలో రాజశేఖర్     
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ ఒక విభిన్నమైన కథను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో .. రాజశేఖర్ యాక్షన్ మార్క్ తో కూడినదిగా ఈ సినిమా ఉంటుంది. సి. కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు.

రాజశేఖర్ పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనుందనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. 'గరుడ వేగ' హిట్ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రశాంత్ వర్మ వినిపించిన ఈ కథ నచ్చడంతోనే ఆయన ఉత్సాహాన్ని చూపించారు. అలా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా కూడా తనకి హిట్ ఇస్తుందనే పూర్తి నమ్మకంతో రాజశేఖర్ వున్నారు. 
rajasekhar

More Telugu News