ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో అన్ని సీట్లకూ పోటీ చేస్తాం!: జనసేన నేత నాదెండ్ల మనోహర్
- ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోం
- ఒంటరిగానే ఎన్నికలకు వెళతాం
- మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనతరంగం కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే జనసేన కార్యాచరణను ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.