మనసును కదిలిస్తోన్న వైఎస్ బయోపిక్.. 'యాత్ర' టీజర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనసును కదిలిస్తోన్న వైఎస్ బయోపిక్.. 'యాత్ర' టీజర్!

  • మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా 'యాత్ర'
  • మనసును కదిలించే దృశ్యాలతో టీజర్ 
  • ఫిబ్రవరి 8వ తేదీన భారీస్థాయి విడుదల    
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను 'యాత్ర' పేరుతో దర్శకుడు మహి.వి రాఘవ్ రూపొందిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

"నీళ్లుంటే కరెంట్ ఉండదు .. కరెంట్ వుంటే నీళ్లు వుండవు .. రెండూ వుండి పంట చేతికి వస్తే, సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు .. మమ్మల్ని రాజులుగా కాదు .. రైతులుగా బ్రతకనివ్వండి చాలు' అనే రైతుల ఆవేదనతో ఈ టీజర్ మొదలవుతోంది. 'నేను విన్నాను .. నేను వున్నాను' అంటూ ఓదార్పుగా మమ్ముట్టి చెప్పిన డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఎండనక .. వాననకా ఆయన చేసే పాదయాత్రకి సంబంధించిన విజువల్స్ తో ఈ టీజర్ ఆకట్టుకునేదిలా వుంది. రాజశేఖర్ రెడ్డి హుందాతనాన్ని .. నిండుదనాన్ని మమ్ముట్టి లుక్ తో తీసుకురాగలిగారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
mammootty

More Telugu News