కేరళలో కొత్త రికార్డును నెలకొల్పలేకపోయిన 'ఒడియన్'
- కేరళలో తొలి రోజు వసూళ్లు 7 కోట్లు
- వారాంతానికి 15 కోట్ల వసూళ్లు
- 'బాహుబలి 2' పేరు పైనే రికార్డు
విడుదలకి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో విడుదల తరువాత ఈ సినిమా పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు భావించారు. కేరళలో విడుదలైన తొలి రోజున ఈ సినిమా 7 కోట్లను వసూలు చేసింది. దాంతో వారాంతానికి ఈ సినిమా 'బాహుబలి 2' వసూళ్లను అధిగమించి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావించారు. కానీ మిశ్రమ స్పందన ప్రభావం వసూళ్లపై పడి, వారాంతానికి ఈ సినిమా 15 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. దాంతో 'బాహుబలి 2' సాధించిన 15.8 కోట్లను అధిగమించలేకపోయింది. దాంతో ఆ రికార్డు 'బాహుబలి 2' పేరుతోనే ఉండిపోయింది.