తండ్రి దర్శకత్వంలో తొలిసారిగా కల్యాణి ప్రియదర్శన్
- మోహన్ లాల్ తో ప్రియదర్శన్
- భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న మూవీ
- వచ్చే ఏడాదిలో విడుదల
మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఒక సినిమాలో అర్జున్ .. కీర్తి సురేశ్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను కల్యాణి ప్రియదర్శన్ చేస్తోంది. తండ్రి దర్శకత్వంలో ఆమె తొలిసారిగా చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగులో కల్యాణి ప్రియదర్శన్ జాయిన్ అయింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.