2019 ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్!
- రాజకీయాలు స్వార్థపూరితంగా మారాయి
- అందుకే నేతలు పార్టీలను నడుపుతున్నారు
- అనంతపురంలో మీడియాతో మాట్లాడిన పవన్
2019 ఆంధ్ర్రప్రదేశ్, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో వచ్చే ఫిబ్రవరిలో వెల్లడిస్తానన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన రెయిన్ గన్లతో అనంతపురం రైతులకు ఏమాత్రం లాభం చేకూరలేదని విమర్శించారు. అనంతపురంలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అసలు అసెంబ్లీకే వెళ్లడం లేదనీ, కరవుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు.