యాక్షన్ సీన్స్ అదుర్స్ అనేలా ఉంటాయట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ సీన్స్ అదుర్స్ అనేలా ఉంటాయట!

  • రాజశేఖర్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ 
  • 1983లోని కథా నేపథ్యం 
  • హైలైట్ గా నిలిచే యాక్షన్ సీన్స్   
రాజశేఖర్ కి కాస్త వయసు పైబడినా 'గరుడ వేగ' సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేశాడని చెప్పుకున్నారు. ఆ సినిమా సక్సెస్ ఆయనలో నూతనోత్సాహాన్ని నింపింది. అదే స్థాయి హిట్ ను అందుకోవాలనే పట్టుదలతో ఆయన కాస్త ఆలస్యమైనా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను ఎంచుకుని రంగంలోకి దిగారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కూడా యాక్షన్ ప్రధానంగానే ఉంటుంది. కథా నేపథ్యం మాత్రం 1983కి సంబంధించి కొనసాగుతుంది. రాజశేఖర్ ఇంతవరకూ చేసిన సినిమాలకి ఇది పూర్తి భిన్నంగా ఉండనుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను రీసెంట్ గా పూర్తి చేశారు. డూప్ లేకుండా రాజశేఖర్ పాల్గొన్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఆయనకి మరో హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.     
rajasekhar

More Telugu News