కూకట్ పల్లి ‘కాపు’ సభలో పవన్ కల్యాణ్ పేరెత్తిన కేటీఆర్.. నినాదాలతో మార్మోగిన సమావేశం!
- ఏపీ ప్రభుత్వాన్ని ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు
- చంద్రబాబు, రాహుల్ ఫిడేల్, వీణ వాయించుకోవాల్సిందే
- పవన్ కల్యాణ్ మా పథకాలను ప్రశంసించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోందని కేటీఆర్ అన్నారు. తాము అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారని గుర్తుచేశారు. సమావేశంలో పవన్ కల్యాణ్ పేరెత్తగానే జై జనసేన.. జైజై జనసేన అంటూ నినాదాలు మిన్నంటాయి. కాబోయే ఏపీ సీఎం పవన్ కల్యాణ్.. అంటూ పలువురు యువకులు సభా వేదిక దద్దరిల్లేలా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జనసేన జెండాలను ప్రదర్శించారు.