కూకట్ పల్లిలో నందమూరి సుహాసినికి వ్యతిరేకంగా పురందేశ్వరి ప్రచారం... టీడీపీ వర్గాల్లో కలకలం!
- మాధవరం కాంతారావుకు మద్దతుగా ప్రచారం
- ఓపెన్ టాప్ జీప్ లో రోడ్ షో
- టీడీపీ, కాంగ్రెస్ ఎలా కలుస్తాయని ప్రశ్న
- కాంతారావును గెలిపించాలని వినతి
ఈ ఎన్నికల్లో మాధవరం కాంతారావును గెలిపిస్తే, స్థానికంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని వ్యాఖ్యానించారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి కూకట్ పల్లిలో ఉందని, ఇళ్లలోకి మురుగునీరు వస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. తెదేపా, కాంగ్రెస్ ఎలా కలుస్తాయని ప్రశ్నించిన ఆమె, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏ మాత్రం భావసారూప్యత లేని పార్టీలు కలిశాయని పురందేశ్వరి ఆరోపించారు.