సుహాసిని రాకతో ఒక్కటైన ఎన్టీఆర్ కుటుంబం.. ఆనందోత్సాహాల్లో టీడీపీ శ్రేణులు
- సుహాసినిని ఒప్పించిన భువనేశ్వరి
- ప్రచారానికి రానున్న బాలయ్య
- సోదరి కోసం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న
కూకట్పల్లి నుంచి తొలుత కల్యాణ్ రామ్‌ను బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. అయితే, అందుకు అతడు నిరాకరించడంతో అకస్మాత్తుగా సుహాసినిని తెరపైకి తెచ్చారు. ఆమెతో మంచి సంబంధాలున్న చంద్రబాబు భార్య భువనేశ్వరి మాట్లాడి సుహాసినిని పోటీకి ఒప్పించారు. సుహాసిని నామినేషన్ రోజున బాలయ్య తోడుగా వెళ్లారు. సోదరిని గెలిపించుకుంటామని ఎన్టీఆర్, తారకరత్న, కల్యాణ్ రామ్ ఇప్పటికే ప్రకటించారు. సుహాసిని కారణంగా నందమూరి కుటుంబం ఒక్కటి కావడం ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది.