నా మేనకోడలు సుహాసినికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది: పురంధేశ్వరి
- సుహాసినికి నా దేవెనలు ఎప్పుడూ ఉంటాయి
- మహాకూటమిని, టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి
- బీజేపీ, మోదీని ఓడించేందుకే మహాకూటమి ఏర్పడింది
భావసారూప్యత లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ ను ప్రజలు చిత్తుగా ఓడించాలని పురంధేశ్వరి కోరారు. బీజేపీని, మోదీని ఓడించేందుకే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు. తెలంగాణలో రోడ్లు, నీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు. ఇంతకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అవకాశమిచ్చిన మల్కాజ్ గిరి ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.