ఖమ్మం జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం... జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సభకు చురుకుగా ఏర్పాట్లు
- పలు ప్రాంతాల్లో పర్యటించనున్నముఖ్యమంత్రి
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బహిరంగ సభ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సభ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ముఖ్యమంత్రి ప్రసంగం అందరికీ స్పష్టంగా వినిపించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కర్ణన్తోపాటు పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సభా స్థలిని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.