ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని సాగనంపే సమయం వచ్చింది!: విజయశాంతి
- రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
- 10 మంది మహిళలకు సీట్లు ఇచ్చాం
- కేసీఆర్ కేబినెట్ లో మహిళలే లేరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 10 మంది మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఒక్క మహిళా మంత్రి కూడా లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు.