రాజమహేంద్రవరం వైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... వేలాదిగా చేరుకుంటున్న వైనం!
- నేడు జనసేన కవాతు
- మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
- సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ
నగరమంతా కవాతుకు సంబంధించిన హోర్డింగ్ లు, జనసేన పతాకాలే కనిపిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు పిచుకలలంక నుంచి ప్రారంభమయ్యే కవాతు, ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకూ కొనసాగుతుంది. జనసేన కవాతుకు సీపీఎం, సీపీఐ పార్టీల నుంచి మద్దతు లభించింది. కవాతు అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.