నాగం జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు దినకర్‌రెడ్డి కన్నుమూత!
- వారం రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరిక
- ఊపిరితిత్తుల మార్పిడికి ఏర్పాట్లు చేస్తుండగానే మృతి
- నాగంను పరామర్శించిన వివిధ పార్టీల నేతలు
తీవ్ర అనారోగ్యంతో గత వారం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం వైద్యులు ఏర్పాటు చేస్తుండగానే, గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కుమారుడి మృతితో నాగం కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగం కుమారుడి మృతి విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఆసుపత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు.